హనుమకొండ చౌరస్తా, మార్చి 27: బీసీ రిజర్వేషన్ల అమలుకై ఏప్రిల్ 2న ఢిల్లీలో జరిగే బీసీల పోరు గర్జన సభను విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి ఆరేగంటి నాగరాజుగౌడ్ పిలుపునిచ్చారు. కేయూ పరిపాలన భవనం ఎదుట బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బీసీల పోరుగర్జన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది విద్యార్థులు ఢిల్లీకి చీమలదండువలె తరలివచ్చి పోరుగర్జనను విజయవంతం చేయాలన్నారు.
మోదీ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రలో బీసీ రిజర్వేషన్లు 42 శాతంకు పెంచుతూ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఎవరు ఇచ్చే భిక్షం కాదని ఇది బీసీల సామాజిక హక్కు అన్నారు. ప్రధాని బీసీ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడమే కాకుండా ఆమోదింపజేసి బీసీల పక్షాన నిలబడాలన్నారు. బీసీ ప్రధానిగా ఉండి బీసీలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా నరేంద్ర మోదీ మేల్కొని బీసీల పక్షాన నిలబడాలన్నారు.
బీసీ ప్రధానిగా ఉండి బీసీలకు న్యాయం చేయకుండా అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మ పాత్ర పోషించడం సిగ్గుచేటని ఘాటుగా విమర్శించారు. కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్స్ రేగుల నరేష్, నామాల రవి స్వామి, బీసీ విద్యార్థి సంఘం మహిళా కన్వీనర్ జాహ్నవి, షైనీ, బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు అజయ్‌సింగ్, గణేష్, శ్రీసాయి, వినోద్, అన్వేష్, అఖిల్, ప్రీతి, అపూర్వ, రక్షిత, నికిత, హరిప్రియ, అశ్విత, తనుశ్రీ పాల్గొన్నారు.