My Career My Future | హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 3 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ, ఎన్సీఈఆర్టీ పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ ఈ నెల 4న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.10 గంటల వరకు ‘మై కెరియర్-మై ఫ్యూచర్’ అనే కార్యక్రమాన్ని టీ- సాట్ (T-SAT) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి తెలిపారు.
సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, మోడల్ స్కూళ్లు, వివిధ సంక్షేమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, ప్రత్యేక అధికారులు అందరూ కూడా తమ పాఠశాలల నుండి పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులందరిని రేపు పాఠశాలకు వచ్చి ఆ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా నిర్దేశించగలరని ఆమె పేర్కొన్నారు.
ఇందుకుగాను తమ పాఠశాలలో ఉన్న ప్రొజెక్టర్లు గానీ, ఐఎఫ్పీఎస్(IFPs) కానీ, టీవీలు కానీ సిద్ధం చేసి ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమం యాజమాన్యాల పాఠశాలల్లో జరిగేటట్లు ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె ఆదేశించారు.
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు