హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 3: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వేదిక జరుగుతున్న అంతర్ జిల్లాల మహిళా టీ-20 క్రికెట్ పోటీల్లో రెండో రోజు బౌలర్లు బ్యాట్స్ఉమెన్లని కట్టడి చేయడంలో సఫలీకృతులయ్యారు. కరుణాపురంలోని వంగాలపల్లి వరంగల్ డిస్ట్రిర్ క్రికెట్ అసోసియేషన్ క్రీడా మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో మెదక్ జట్టు నిజామాబాద్ జట్టుపై 37 పరుగుల తేడాతో గెలుపొందినట్లు వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ జట్టు నిర్ణిత 20 ఓవర్లకి గాను కేవలం 17.4 ఓవర్లు ఎదుర్కొని 93 పరుగులకే ఆలౌటైంది.
94 పరుగుల లక్ష చేదనలో బరిలోకి దిగిన నిజామాబాద్ జట్టు 15.5 ఓవర్లు ఎదుర్కొని 56 పరుగులకె కుప్పకూలి 37 పరుగుల తేడాతో ఓటమి చెందింది. మెదక్ జట్టు బౌలర్లు హాసనీ అండ్ హేమలత తలా 3 వికెట్లు తీసి విజయంలో కీలక భూమిక పోషించారు. మొగిలచర్ల జరిగిన మరో మ్యాచ్లో నల్గొండ, మహబూబ్నగర్ తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన నల్గొండ 16.3 ఓవర్లు మాత్రమే ఎదుర్కొని 61 పరుగులు చేసి ఆలౌటైంది. 62 పరుగుల లక్షచేదనలో బరిలోకి దిగిన మహబూబ్నగర్ జట్టు బ్యాట్స్ఉమెన్ అరాయాని(31) పరుగుల రాణింపుతో కేవలం 8.5 ఓవర్లలోనే 64 పరుగులు సాధించి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
