శాయంపేట, మే 10 : శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతన చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరిస్వామి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అంకురారోహణము, విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధన పూజ యాగ్నీకులు వీరవెల్లి వేణుగోపాలాచార్యులు, అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి పూజ హోమం నిర్వహించారు. అనంతరం ద్వజారోహం, గరుడ పటం ఎగురవేశారు. గరుడ ముద్ద ప్రసాదాలు సంతానం లేని దంపతులకు, భక్తులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సామల భిక్షపతి, గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్ సేనారెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేశ్వర్, వినుకొండ శంకరాచారి, దిండిగాల వంశి, మామిడి ప్రమోద్, కంబత్తుల ప్రకాశ్, మంత్రి చందు, గిద్దమారి సురేశ్, నడిగట్టు సాంబయ్య, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.