హనుమకొండ చౌరస్తా, మార్చి 13 : హనుమకొండ కిషన్ పుర మాస్టర్ జీ హై స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న మహమ్మద్ అనాస్ అండర్-14 జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని తన ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి క్రికెట్ టీమ్ కి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ రజిత తెలిపారు. ఏప్రిల్ లో మహబూబ్ నగర్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలలో పాల్గొనబోతున్నాడని చెప్పారు.
ఈ సందర్బంగా మాస్టర్జీ విద్యాసంస్థల చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ మహమ్మద్ అనాస్ ను అభినందించారు. అనంతరం సుందర్ రాజు మాట్లాడుతూ క్రీడా రంగాన్ని ప్రోత్సహించడంలో మాస్టర్జీ విద్యాసంస్థలు ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రాధిక, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.