వరంగల్ చౌరస్తా : వరంగల్ నగరంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలతో పాటుగా పాన్‌షాపులు, కిరాణ షాపులు, బార్ షాపులు, ఇండ్లతో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి మట్టెవాడ పోలీసులు ఆరెస్ట్ చేశారు. సోమవారం మట్టెవాడ సీఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. పోచమ్మమైదాన్ ప్రాంతానికి చెందిన బరుపట్ల సాయి ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆండర్ బ్రిడ్జి ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని దొంగిచడంతో పాటుగా పలు చిల్లర దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఇటీవల దేశాయిపేట 80ఫీట్ల రోడ్డులో మరో వాహనాన్ని దొంగిలించి ఆదే వాహనంతో యాక్సిడెంట్ చేసి పారిపోయినట్లు తెలిపారు.
మరుసటి రోజు దేశాయిపేట రోడ్డులోని ప్రముఖ బుస్టాల్ ముంద పార్కింగ్ చేసివున్ను వాహనాన్ని దొంగిలించి అదే వాహనంపై తిరుగుతున్న వ్యక్తిని ఆటో నగర్ జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు గుర్తించి నిందితుడిని ఆరెస్ట్ చేశారు. నిందితుడు దొంగిలించిన వాహనాలను సీజ్ చేసి, కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరచినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని ఆరెస్ట్ చేయడంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.