జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని 17 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధమైంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరేసరికి మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎనిమిది రైతులు నష్టపోయారు.
ఇదిలా ఉండగా గత నెల 26న ఇదే మొగుళ్ళపల్లి మండలం పెద్ద కోమటిపల్లి శివారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 17 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధమైన విషయం తెలిసిందే. శుక్రవారం టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్ లో మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట అగ్నిప్రమాదంలో కాలి బూడిదయింది.