హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 25: ఇండస్ ఫౌండేషన్(Indus Foundation) ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ హయగ్రీవచారి గ్రౌండ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సాయంత్రం ఐదున్నర గంటలకు సహస్ర లింగార్చన పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ముఖ్య అతిథులుగా మాజీమంత్రి హరీష్ రావు, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్, స్వామి ప్రణవానంద దాస్ గీతసార ప్రవచనం, సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య, ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, ప్రముఖ సింగర్స్ శ్రీకృష్ణ, మాట్ల తిరుపతి, శిరీష, సత్యభామ స్వాతి, భిక్షమమ్మ, అనిత యాదవ్ పాల్గొంటారని తెలిపారు. ఓరుగల్లు వాసులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని రాకేష్ రెడ్డి కోరారు.