Theatrical Performances | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 25 : అజోవిభొ కందాళం ఫౌండేషన్ (అమెరికా), వరంగల్ సహృదయ సాహిత్య సాంస్కతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 4వ తేదీ వరకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ సహృదయ సాహిత్య సాంస్కతిక సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజా మనోహరబాబు, సాంస్కృతిక కార్యదర్శి వనం లక్ష్మీకాంతరావు తెలిపారు.
మంగళవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. 32 సంవత్సరాలుగా ప్రతీ యేటా మూడురోజుల పాటు రాష్ట్రస్థాయి సాంఘీక నాటిక పోటీలు నిర్వహించనున్నట్లు, ఈ నాటిక పోటీల్లో అన్నీ కొత్త నాటికలే ఉంటాయన్నారు. ప్రదర్శనకు ఎంపికైన నాటికలను పుస్తకరూపంలో ప్రచురించడం, రచయితలను నగదు బహుమతితో సత్కరించడం ఈ పోటీల ప్రత్యేకతని చెప్పారు. ప్రతిరోజూ మొదటి ప్రదర్శన తర్వాత నాటక రంగానికి విశిష్ట సేవలందించిన కళాకారుడికి సేవామూర్తి పురస్కారం అందిస్తున్నట్లు తెలిపారు.
2026 ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం సీకేఎం విశ్రాంత ఉపన్యాసకులు, రచయిత డాక్టర్ గుంజి వెంకటరత్నంకు రూ.లక్ష అందజేయనున్నట్లు, విశిష్ఠ సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కారం(2026) కవి, కథకుడు, నవలారచయిత రామా చంద్రమౌళికి రూ.50 వేలు, ‘సరిలేరు నీకెవ్వరు’ విశిష్ఠరంగస్థల పురస్కార గ్రహీత కోట్ల హనుమంతరావుకు రూ.25 వేలు అందజేసి ఘనంగా సత్కరించనున్నట్లు వారు తెలిపారు.
మూడురోజులు ప్రత్యేకంగా ఉభయ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన తెలుగు కథానాటికల ప్రదర్శన ప్రతిరోజు మూడు నాటికలు మొత్తం 9 నాటికల ప్రదర్శలు, ప్రతిరోజు మూడు రంగస్థల సేవ చేసిన ఒక వ్యక్తికి రూ.10 వేల చొప్పున రంగస్థల పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. పురస్కారాలు అందుకుంటున్న ప్రముఖులు ముగ్గురి సాహిత్యాల విశ్లేషణలు ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి 1 గంటల వరకు సాహిత్య సమాలోచన సదస్సులు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, ఆచార్య డీఎస్ఎన్ మూర్తి, రామకోటేశ్వరరావు, ఏవీ నరసింహారావు, కె.కృష్ణమూర్తి, న్యాలకొండ భాస్కరరావు పాల్గొన్నారు.
Harish Rao | నీకు మహిళలు ఎందుకు ఓటెయ్యాలి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
Palash Muchhal | మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధానకు కాబోయే భర్త