హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 26 : ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటి కాలుష్యానికి, జీవవైవిధ్య నాశనానికి దారితీస్తాయని ప్రతిఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజిద్దామని కేడీసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బోటనీ విభాగం ఆధ్వర్యంలో కాలేజీ ప్రాంగణంలో ‘మట్టి వినాయక విగ్రహాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాలు ఆనందోత్సాహాలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ బాధ్యత మనందరిపై ఉందన్నారు. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా భక్తిని కాపాడుతూ భవిష్యత్ తరాలకు శుభ్రమైన ప్రకృతిని అందించగలమని చెప్పారు. అనంతరం విద్యార్థులు తయారుచేసిన మట్టి వినాయక విగ్రహాలను పరిశీలించి, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, ఇందిరాదేవి ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఏ.శ్రీనాథ్, అధ్యాపకులు చిన్నా, పల్లవి, ఈ.కొమల, శ్యాంప్రసాద్, సమ్మయ్య,