Chalo Osmania | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 1: తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో 1335 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ యూజీసీ 7వ వేతన ఒప్పందం ప్రకారం ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 4న ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే ర్యాలీని జయప్రదం చేయాలని కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ పిలుపునిచ్చారు.
యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకమందు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరినీ రెగ్యులర్ చేస్తామని ఈ రోజు వరకు కూడా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయలేదన్నారు.
వారికి వెంటనే ఉద్యోగ భద్రతతోపాటు యూజీసీ 7వ వేతనం ప్రకారం ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేయూ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు దామెర భిక్షపతి, పుల్లా రమేష్, చందులాల్, సాయిచరణ్ , ప్రసాద్ పాల్గొన్నారు.
Actress | భిక్షాటనతో జీవనాన్ని సాగిస్తున్న నటి.. కంటతడి పెట్టిస్తున్న నుపుర్ అలంకార్ కథ
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9లో మరో ట్విస్ట్ .. శ్రీజ ఎలిమినేషన్, కొత్త కెప్టెన్గా దివ్య!
NTR | గాయాల నుండి పూర్తిగా కోలుకున్నఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్ భారీ షెడ్యూల్ ఎప్పటి నుండి అంటే..!