భీమదేవరపల్లి, మే 28: సభ్యుల పరస్పర సహకారంతో పొదుపు సంఘాలు ఆర్థిక ప్రగతి సాధిస్తాయని సహా వికాస మేనేజర్ లక్ష్మణ్ అన్నారు. బుధవారం మండలంలోని కొత్తకొండ బీఆర్కే ఫంక్షన్ హాలులో ముల్కనూరు పురుషుల పొదుపు సమితి -2 పదవ వార్షిక మహాసభ అధ్యక్షులు గాజుల సతీష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యులు పొదుపు చేసుకున్న నిధులు కష్టకాలంలో వారి కుటుంబాలకు ఆర్థిక చేయూతగా మారుతాయన్నారు. ముల్కనూరు పురుషుల పొదుపు సమితి -2 లో 14 సభ్య సంఘాలు ఉండగా రూ. 5,38,75,850 నియమిత పొదుపులు ఉన్నట్లు చెప్పారు. పొదుపుల నుండి వచ్చిన లాభాన్ని రూ. 4,58,37,563 బోనస్ రూపేణ పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సహావికాస డీఏ సుమలత, డీఏ ఈశ్వర్, ముల్కనూరు పొదుపు సమితి – 1 అధ్యక్షులు జాన ప్రవీణ్, డైరెక్టర్ లు అల్లం శ్రీనివాస్, ఎల్ది బొందయ్య, భూక్య సమ్మయ్య, తబొల్లంపెల్లి చిన్న రాములు, భూక్య చంద్రు, బర్రె ప్రతాప రెడ్డి, ఎస్ డీ జబ్బర్, కొలుగూరి మధుకర్, అయిత రవీందర్, నిలిగొండ మల్లయ్య, గుర్రపు కుమారస్వామి, అన్నవేన రాజు, కంకల సదానందం, పిట్టల ఐలయ్య, దుర్శనపల్లి రాజేశ్వర్ రావు, చింత రమేష్, ఆకుల రాజు, షేక్ ఆలీ, వెన్నం లింగారెడ్డి, జేరిపుల రాజు, నిమ్మశెట్టి రాం సృజన్, దాసరి రవీందర్, గణకులు గజ్జెల రవీందర్, కుమారస్వామి, పొదుపు సంఘాల డైరెక్టర్ లు పాల్గొన్నారు. కాగా, వీరభద్ర పురుషుల పొదుపు సమితి అధ్యక్షులుగా గాజుల సతీష్, ఉపాధ్యక్షులుగా ఎల్ది బొందయ్య, ముల్కనూరు పురుషుల పొదుపు సమితి – 2 అధ్యక్షులుగా బర్రె ప్రతాప రెడ్డి, ఉపాధ్యక్షులుగా కొలుగూరి మధుకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.