హనుమకొండ చౌరస్తా : ఈ నెల 19న హైదరాబాద్ ఇందిరాపార్క్వద్ద జరిగే లంబాడీల ఆత్మగౌరవ నిరసన ధర్నాను విజయవంతం చేయాలని గ్రేటర్ వరంగల్ లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ భూక్యా మోతిలాల్ నాయక్, కన్వీనర్ బానోత్ నవీన్ నాయక్, కన్వీనర్ నునావత్ జవహర్ నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని జైసింగ్ రాథోడ్, జాటోత్ కిషన్ నాయక్ నాయకత్వంలోని లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడీలను కించపరుస్తూ దూషిస్తూ అవమానిస్తూ మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ జడ్పీటీసీ వీరమ్మ, గోపిసింగ్ నాయక్, కో కన్వీనర్లు సమ్మయ్య రాథోడ్, అజ్మీరా వెంకట్ నాయక్, బానోత్ భాస్కర్ నాయక్, గుగులోత్ వీరమ్మ భాయి, ధరావత్ దేవేందర్ నాయక్, అముగోత్ సుధాకర్ నాయక్, లావుడియా రాజు నాయక్, అజ్మీరా సునీతాబాయి, తేజావత్ ఫణి కుమార్ నాయక్, భూక్యా రమేష్ నాయక్, బానోత్ వీరు నాయక్, లావుడియా బాలు నాయక్, బానోత్ అశోక్ నాయక్, బానోత్ శ్రీకాంత్ నాయక్, భూక్యా సిద్దు నాయక్, ధరావత్ రాము నాయక్, లావుడియా రాము నాయక్, బానోత్ ఈరియా నాయక్ పాల్గొన్నారు.