భక్తి భావానికే దేవాదాయశాఖ మొదటి ప్రాధాన్యత : కృష్ణప్రసాద్
భక్తి భావానికే దేవాదాయశాఖ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ 5వ జోన్ డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్ అన్నారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 18: భక్తి భావానికే దేవాదాయశాఖ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ 5వ జోన్ డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్ అన్నారు. చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో కార్తీకమాసం 9వ రోజు కార్తీక రుద్రాభిషేకం నిర్వర్తించారు. ఉప కమిషనర్ డి.కృష్ణప్రసాద్ దేవాలయాన్ని సందర్శించిన సందర్భంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఉత్తిష్ట గణపతి దర్శనం కల్పించి రుద్రేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వర్తింపజేసి ఆలయనాట్యమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రాలు అందించారు. అనంతరం ఆలయ బుకింగ్ పరిశీలించి దేవాలయ ప్రాంగణమంతా కలియదిరిగి ఉసిరిక వృక్షం దగ్గర కార్తీకదీపం వెలిగించుకున్నారు.
ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 23, 24 తేదీలలో రెండో సోమవారం, కార్తీక పౌర్ణమి వస్తున్నందున 5 జోన్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు ఆదేశానుసారంగా 19 జిల్లాల్లో ఉన్న శివ, విష్ణు దేవాలయాలలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా మహిళలకు దీపారాధనకు ఉచితంగా ప్రమిదలు, వత్తులు, నువ్వుల నూనె అందజేయాలని, దీపాలు వెలిగించుకున్న తర్వాత మహిళలకు కనుములు, వాయినదానములు అందజేయాలని, సహస్ర దీపోత్సవాలు, లక్షద్వీపోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, క్యూలైన్స్ ఏర్పాటు చేసుకోవాలని ఎండలు తీవ్రంగా ఉన్నందున చల్లటి తాగునీరు సౌకర్యం, ఉచిత ప్రసాద పంపిణీ నిర్వర్తించాలని సంబంధిత దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు తగు ఆదేశాలు జారీ చేశారు.
సిబ్బంది భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ అశ్రద్ధగా వ్యవహరించకూడదని విధులలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు. విధి నిర్వహణలో ఎవరు కూడా అతిగా ప్రవర్తించకూడదని రాష్ర్టవ్యాప్తంగా అన్ని దేవాలయాల కార్యనిర్వహణాధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట దేవాదాయ శాఖ రెవెన్యూ అధికారిని సునీత, సర్వేయర్ అనిల్ ఉన్నారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి డి.అనిల్‌కుమార్ వారికి స్వాగతం పలికారు. వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేద పండితులు మణికంఠశర్మ, శ్రవణ్, ప్రసాద్ కాశీనాధాచార్యులు నిర్వహించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wall Collapse | కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్.. వీడియో
Panchayat Season 5 | ఫులేరా గ్రామానికి మళ్లీ స్వాగతం.. కొత్త సీజన్‌తో రాబోతున్న ‘పంచాయత్’
PP Bribe | పెద్దపల్లిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
Car Stolen With Sleeping Girl | బాలిక నిద్రిస్తున్న కారును చోరీ చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు పోతున్నా సహారా బాధితులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

