కాజీపేట, జులై 05: రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న ఓ సెల్‌ఫోన్‌ను జీఆర్పీ పోలీసులు తిరిగి అప్పగించారు. కాజీపేట జీఆర్పీ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన ఏ.బిక్షపతి(52) నెలకిందట సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు కాజీపేట రైల్వే జంక్షన్వకు వచ్చాడు. రైలు ఆలస్యం కావడంతో వెయిటింగ్ హాలులో కూర్చున్నాడు. ఆ సమయంలో తన వివో వై 12 మోడల్ మొబైల్‌ను చార్జింగ్ పెట్టి మూత్ర విసర్జనకు వెళ్లొచ్చాడు. ఇంతలో అతని మొబైల్‌ను ఎవరో ఎత్తుకెళ్లారు. దీంతో బిక్షపతి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న జీఆర్పీ పోలీసులు విచారణ చేపట్టి సెల్‌ఫోన్ దొంగను పట్టుకున్నారు. బాధితుడికి ఇవాళ తిరిగి సెల్‌ఫోన్‌ను అప్పగించారు.