కాజీపేట, ఫిబ్రవరి 02 : మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు తేవడంతో కోట్లాదిమంది అట్టడుగు కార్మిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని సిఐటియు మండల కన్వీనర్ కారు ఉపేందర్ అన్నారు. హనుమకొండి జిల్లా కాజీపేటలో స్థానిక సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యక్తిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12 న దేశవ్యాప్త సార్వత్విక సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. లేబర్ కోడ్ లు రద్దయ్యేంత వరకు జరిగే పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు , కార్మిక, రైతు, కూలి సంఘాలు భాగ స్వాములు కావాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం దళితులు గిరిజనులు, పేదలకు ఒక వరం లాంటిదని, కరువులు, కరోనా వచ్చి నప్పుడు ఈ పథకం వేలాది మంది పేదల పొట్ట నింపి కాపాడిందిన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసా గించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమం లో కాజీపేట భవన నిర్మాణ సంఘం గౌరవ అధ్యక్షులు ఎర్ర రాజు, కార్యదర్శి దేవేందర్, వివేకానంద యూనియన్ గౌరవాధ్యక్షుడు ఇమ్మడి రాజు, కంచం ఐలయ్య, చిట్టి అశోక్, ప్రధాన కార్యదర్శి గొలుసు రమణ, కాలేశ్వరం రాజేందర్, కాల వీరస్వామి, జేరిపోతుల కుమార్, బరిగల కుడి సామి, రేనుకుంట్ల మహేష్, బస్కే రంజిత్, పంగ వేణు, వల్లపు తిరుపతి, గోల్కొండ ఏసు, చిలువేరు ప్రభాకర్, దాసరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.