Job Mela | ఏప్రిల్ 2న ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా.. ఈ ఆర్హతలు ఉంటే చాలు..!
హనుమకొండ చౌరస్తా, మార్చి 31: వరంగల్ ములుగురోడ్డులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ) ప్రాంగణంలో ఏప్రిల్ 2 (గురువారం)న జాబ్ మేళా నిర్వహించనున్నారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 31: వరంగల్ ములుగురోడ్డులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ) ప్రాంగణంలో ఏప్రిల్ 2 (గురువారం)న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా
నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ మంగనూరి చందర్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంస్థ శ్రీనివాస సేల్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరగనుందని ఆయన తెలిపారు.
జాబ్ మేళాలో టెక్నిషన్స్, సర్వీస్ ఇంజనీర్స్గా పనిచేసేందుకు ఐటీఐ, డిప్లొమా, బి.టెక్ పూర్తిచేసిన అభ్యర్ధులు అర్హులని ప్రిన్సిపాల్ మంగనూరి చందర్ వెల్లడించారు. వీరితో పాటు ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, డీజిల్ మెకానిక్ విభాగాల్లో ఉత్తీర్ణులైన వారు.. వొకేషనల్ ఇంటర్లో ఎలక్ట్రిషియన్, ఆటోమొబైల్లో ఉత్తీర్ణులైన వారు కూడా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.
ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి శిక్షణ సమయంలో రూ.18 వేలు, ట్రైనింగ్ అనంతరం రూ.20 వేలు ఇస్తారని.. పీఎఫ్, ఈఎస్ఐ, టీఏ, డీఏలతో పాటు ఇతర బోనస్ ప్రయోజనాలు కూడా ఉంటాయని ప్రిన్సిపాల్ మంగనూరి చందర్ తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

