హైదరాబాద్, ఆగస్టు 13( నమస్తే తెలంగాణ): తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ‘తాతాలిక నమోదు కమిటీ’ ద్వారా చేపట్టే న్యాయవాదుల నమోదు ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కమిటీ ఏర్పాటు చట్టవిరుద్ధమంటూ బీ జగదీశ్వర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై తుది ఉత్తర్వులు వెలువడే వరకు నమోదు ప్రక్రియను కొనసాగించరాదని జస్టిస్ ఎన్ తుకారాంజీ స్పష్టంచేశారు. కేసు తదుపరి విచారణను 31 ఆగస్టు 2026కి వాయిదా వేసింది.