హామీల కమిటీ పరిధిపై స్పష్టత ఇవ్వాలి
శాసనమండలి ప్రభుత్వ హామీల కమిటీ పరిధిపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్, దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గురువారం మండలి ప్రభుత్వ హామీల కమిటీ ప్రారంభ సమావేశానికి హాజరై పలు కీలకాంశాలను ప్రస్తావించారు.
- ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, దాసోజు శ్రవణ్‌కుమార్
హైదరాబాద్, ఆగస్టు 13 (నమసే ్తతెలంగాణ): శాసనమండలి ప్రభుత్వ హామీల కమిటీ పరిధిపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్, దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గురువారం మండలి ప్రభుత్వ హామీల కమిటీ ప్రారంభ సమావేశానికి హాజరై పలు కీలకాంశాలను ప్రస్తావించారు. సభ్యుల గౌరవాన్ని పెంచిన చైర్మన్ సుఖేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ పరిధిలోకి వచ్చే హామీలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
పార్టీలకతీతంగా కమిటీ ప్రజల పక్షాన నిలబడాలని, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం కమిటీకి ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీలకు సీడీఎఫ్ నిధులు పునరుద్ధరించాలని డిమాం డ్ చేశారు. ఎమ్మెల్సీల హక్కులు, విధులు, చట్టపరమైన రక్షణలపై సభ్యులందరికీ అవగాహన కల్పించేందుకు ఆపరేషనల్ డెఫినేషన్ డాక్యుమెంట్ రూపొందించి అందజేయాలని కోరారు. రాజ్యాంగ పరిధిలో అధికారులు పనిచేసేలా సూచనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, వైఎస్ చైర్మన్ బండ ప్రకాశ్, కమిటీ చైర్మన్ కేతావత్ శంకర్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

