హనుమకొండ చౌరస్తా, జూలై 29: సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కాకతీయ యూనివర్సిటీ భౌతికశాస్త్ర అధ్యాపకుడు జితేందర్ ఆ కళాశాలకు ట్రైనింగ్ ప్లేస్మెంట్ అధికారిగా నియమించినట్లుగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్జజ్యోతి తెలిపారు.
జితేందర్‌కి రెండోసారి కొనసాగింపుగా ఆర్డర్స్ అందజేసినట్లు, గత సంవత్సరంలో కూడా అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, రిక్రూమెంట్ డ్రైవ్స్, ఇంటర్నషిప్ ప్రోగ్రామ్స్ ఇంకా అనేక ఎన్జీవో ఆర్గనైజేషన్‌తో ఎంఓయులు కూడా చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, అధ్యాపకులు జితేందర్‌ని అభినందించారు.