హనుమకొండ చౌరస్తా, జూలై 10 : ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12న ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నట్లు ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ నిర్వాహకులు వడ్డీ లలితారావు, హసీనా తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. అంబేద్కర్ భవన్లో ఈనెల 12న కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల వారి కోసం ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నామని, ఈ ఫ్యాషన్ షోలో వివిధ కేటగిరీలలో పురుషులు, స్త్రీలు, గృహిణులు, చిన్న పిల్లలు, వయోవృద్ధులు పాల్గొనవచ్చన్నారు.
ఈ పోటీలో పాల్గొనేందుకు మోడల్స్ఒక్కొక్కరికి ఎంట్రీ ఫీజు రూ.999 నిర్ణయించామని, ట్రై సిటీలోని యువత, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, యూట్యూ బర్లు, మోడల్ రంగంలో నిష్ణాతులు పాల్గొంటున్నారని, ఈ అవకాశాన్ని మోడల్స్ వినియోగించుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ నిర్వాహకులు వనజ, రోషిని, సనాత బస్సుమ్, మహిత పాల్గొన్నారు.