ధర్మసాగర్ : హనుమాన్ మాలదారణ స్వీకరించిన భక్తులు మాల విరమణకు కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు. ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని హనుమాన్ ఆలయం నుండి సుమారు 14 మంది మాలదారులు పాదయాత్రగా ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఈనెల 22 న హనుమాన్ జయంతి సందర్భంగా మాలదారణ విరమణ చేయనున్నట్లు తెలిపారు.
కాగా గురు స్వాములు మడికంటి సాయిబాలు, పుట్ట చంద్రు స్వాములకు ఇరుముడి కట్టి భక్తులను పాదయాత్రగా పంపించారు. పాదయాత్రగా కొండగట్టును చేరడానికి రెండు నుండి మూడు రోజులు పడుతుందని స్వాములు తెలిపారు. స్వాములు ఏశబోయిన మహేష్, డబ్బేట సాంబరాజు, మాచర్ల పవన్, రాంచరణ్, రామకృష్ణ, వినేశ్, చందు, శ్రీనాద్, ప్రశాంత్, సాంబరాజు, తదితరులు పాదయాత్రగా వెళ్లారు.