హనుమకొండ చౌరస్తా, జూన్ 16 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచాలని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఉపాధ్యాయులకు సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం 8వ డివిజన్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కుమార్‌పల్లి మార్కెట్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా జరిగిన పలు అభివృద్ధి పనులను గురించి హెచ్ఎంను అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్ల సంఖ్యను అడిగి తెలుసుకుని కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ఉన్నత చదువులు చదివి గొప్పస్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా 8వ డివిజన్లోని కుమార్‌పల్లి సాబీర్ హోటల్ జంక్షన్ నుంచి సీసీ రోడ్డు, డ్రైనేజీ పనుల నిర్మాణానికి నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీ వాసులు నుంచి పలు విజ్ఞప్తులను స్వీకరించారు. సమస్యలు పరిషరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్ బైరి లక్ష్మి, కార్పొరేటర్ చెన్నం మధు, మాజీ కార్పొరేటర్ మిర్యాల్‌కార్ దేవేందర్, టీఆర్ఎస్ నాయకులు బొల్లపల్లి పున్నంచందర్, సిద్ధంశెట్టి శ్రీనివాస్, వెన్ను కొండరయ్య, చింతాకుల ప్రభాకర్, కూచన సునీల్, అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
నయీంనగర్ : పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ శాసన సభ్యుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 52, 53వ డివిజన్లలోని బంజారా కాలనీ, లష్కర్ సింగారం కాలనీల్లో పర్యటించారు. కాలనీ వాసులు నుంచి పలు విజ్ఞప్తులను స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్లు చాడ స్వాతి, సోదా కిరణ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు సుగుణాకర్‌రెడ్డి, ముర్తుజా, నాయకులు, కాలనీ ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.