హనుమకొండ చౌరస్తా, జూలై 10: ఉద్యమకారుల సంక్షేమ స్కీమ్ మాత్రమే కాకుండా శాశ్వత ప్రాతిపదికన రూ. 5 వేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఉద్యమకారుల సంక్షేమ నిధి రూపకల్పన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ కాకతీయకాలనీలోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యమకారుల గుర్తింపు లోపం తెలంగాణ రాష్ర్ట సాధనలో అమరులైన, జైలు పాలైన, పోలీస్ కేసులు ఎదుర్కొన్న, బైండోవర్ అయిన, గాయపడిన, క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించాలన్నారు.
రాష్ర్ట ఆవిర్భావం (జూన్ 2, 2014) తర్వాత ఉద్యమకారులు తమ జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించినా, విరుద్ధంగా నిరాశ ఎదురై అనేక మంది మనోవేదనతో కాలం చెలించారని, అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం 250 గజాల ఇంటి స్థలం, ప్రతినెల 25000 పెన్షన్, ఫ్రీ బస్‌పాస్, ఆరోగ్య భీమా, ట్రిపుల్బెడ్ రూమ్ ఇల్లు, విద్యా, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
17న ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు ప్రక్రియపై సలహాలు, సూచనలు కలిగిన వినతిపత్రాన్ని కేకే కమిటీకి అందజేస్తామని రవికుమార్ తెలిపారు. సమావేశంలో అడ్‌హక్
కమిటీ సభ్యులు నొడపెల్లి శ్యామ్ కృష్ణ, బొలిశెట్టి అశోక్, చాంద్‌పాషా, మనోహర్‌రావు, ఎండి.ఖదీర్, దాసరి జనార్దన్, టీన్ స్వామి, చెన్నూరి నటరాజ్, మొలంగూరి నెల్సన్, ముగుసలా దేవేందర్‌రెడ్డి, మీర్జా అంజాద్, సువర్ణలతా, గోపనబోయిన రాజు, ఐమాడిశెట్టి రాజు, యేడునురి రాజమౌళి, జక్కుల స్వామి, యాదవ్, షైక్ దస్తగిరి, మాస్క్ కరుణాకర్, కేడల ప్రసాద్ పాల్గొన్నారు.