హనుమకొండ చౌరస్తా, జనవరి 12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఓసీలకు ఈడబ్ల్యూఎస్ పటిష్ట అమలుకు వెంటనే ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ జేఏసీ రాష్ర్ట అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి
డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలోని పోస్టల్‌కాలనీ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హనుమకొండ ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజ్లో ఆదివారం నిర్వహించిన ఓసీల సింహగర్జన బహిరంగ సభకి రాజకీయాల కతీతంగా రాష్ర్ట నలుమూలల నుంచి స్వచ్ఛందంగా 50 వేలకు పైగా తరలి వచ్చిన ఓసీలందరికీ ఓసి జేఏసీ రాష్ర్ట కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ఓసీ జేఏసీ డిమాండ్స్‌ను వెంటనే ప్రభుత్వాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసీ జేఏసీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, నాయకులు అర్జుల కిషన్‌రెడ్డి, గొట్టెముక్కుల ప్రభాకర్‌రెడ్డి, కామిడి సతీశ్‌రెడ్డి, ఓకంటి యాకూబ్‌రెడ్డి, రెంటాల కేశవరెడ్డి, చిట్టిరెడ్డి వెంకట్‌రెడ్డి, పవన్‌కుమార్, డి.తిరుపతిరెడ్డి, మన్నెం ఇంద్రారెడ్డి, వీసం రమణారెడ్డితో పాటు వివిధ జిల్లాల ఓసి సామాజిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.