కాజీపేట: తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా దుండగులు చోరీలకు పాల్పడ్డారు.సిద్ధార్థ నగర్లో దొంగలు తాళం పగలగొట్టి రెండు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధార్థ నగర్ చెందిన ఎస్తేరు అనే మహిళ ఆదివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని కూతురింటికి వెళ్లింది. సోమవారం రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి బీరువాను తెరిచి చేసే సరికి అందులో వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నట్లు తెలిపారు.
బీరువాలోని రెండు తులాల బంగారం వస్తువులను ఎత్తుకు పోయారని బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. అదే కాలనీలో వెంకటరమణ అనే వ్యక్తికి చెందిన బైకును గుర్తు తెలియ వ్యక్తులు ఎత్తుకు పోయారు. బాధితుడు సోమవారం రాత్రి కాజీపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.