బయ్యారం జూన్ 14 : చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను బయ్యారం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు గార్ల బయ్యారం సీఐ రవికుమార్ వెల్లడించారు. గార్ల, కురవి, గూడూరు మండలాలకు చెందిన గూగులోతు సాయి కిరణ్, బోడ రవి, గూగులోతు రవితేజ, మాలోతు ప్రేమ్ కుమర్, తోట కృష్ణ, భూక్యా హుస్సేన్ ముఠాగా ఏర్పడి జిల్లాలోని పరచోట్ల రాత్రి సమయంలో చోరీకి పాల్పడుతున్నట్లు తెలిపారు. నర్సంపేట బైపాస్ రోడ్లో రోటే వేటర్ ను దొంగలించారు.
బయ్యారం మెయిన్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసులు చూసి పారిపోయేందుకు ప్రయత్నించటంతో పట్టుకుని విచారించగ నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితుల దగ్గర నుండి టాటా ఏసీ వాహనం, ట్రాక్టర్, రోటవేటర్, 5 మొబైల్ ఫోన్ లను సీజ్ చేసినట్లు తెలిపారు. దొంగలను పట్టుకున్న బయ్యారం ఎస్ఐ తిరుపతి, పోలీస్ సిబ్బంది మోహన్, సారంగపాణి, సురేష్, రమేష్, హరిదాస్, మహేష్ లను సీఐ రవికుమార్ అభినందించారు.