హనుమకొండ రస్తా, సెప్టెంబర్ 9 : చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో రుద్రాభిషేకాలు నిర్వహించి ఆలయ నాట్యమంటపంలో రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామివార్లకు మాసకళ్యాణోత్సవం నిర్వహించారు. ఈనెల 14 నుంచి 23 వరకు జరిగే గణపతి నవరాత్రోత్సవాల కరపత్రాలు, పోస్టర్లను వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆవిష్కరించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని, ‘ప్రకృతిని ప్రేమించు పర్యావరణాన్ని రక్షించు’ అనే సూత్రంతో భక్తమండళ్లు నిర్వహించుకోవాలని సూచించారు.
9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, హోమాది కార్యక్రమాలు, అన్నదానాలు, ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో అనిల్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, సిబ్బంది పాల్గొన్నారు.