Belt shops | ఐనవోలును బెల్ట్ షాపుల రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందాం: గడ్డం రఘువంశీ
మల్లికార్జునస్వామి కోలువుదీరిన ఐనవోలు గ్రామాన్ని బెల్ట్ షాపుల రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందామని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గడ్డం రఘువంశీ పిలుపు నిచ్చారు.
ఐనవోలు : (హనుమకొండ) మల్లికార్జునస్వామి కోలువుదీరిన ఐనవోలు గ్రామాన్ని బెల్ట్ షాపుల రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందామని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గడ్డం రఘువంశీ పిలుపు నిచ్చారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో చేసిన బెల్ట్ షాపుల బంద్ తీర్మానం గ్రామంలో నేటి నంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. మహిళా సంఘాలు, యువకులు, నాయకులతో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు.
గ్రామంలోని బెల్ట్ షాపుల వల్ల వయసుతో సంబంధం లేకుండా తాగుడుకు బానిసాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల కోరిక మేరకు బెల్ట్ షాపులను నిషేధిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ తీర్మానానికి వ్యతిరేకంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే రూ.10 వేల జరిమానాతో పాటు సంక్షేమ పథకాలకు కట్ చేస్తామని హెచ్చరించారు. బెల్ట్ షాపు రహిత గ్రామంగా తయారు చేయడానికి గ్రామస్తులందరు సహకరించాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో పంచాయతీ సెక్రటరీ కిశోర్, ఉప సర్పంచ్ బరిగెల భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

