కాజీపేట, సెప్టెంబర్ 1 : కాజీపేట పట్టణం అయోధ్య పురం గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న రైల్వే మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్లో(ఆర్ఎంయూ) భూములుకోల్పోయిన భూనిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అయోధ్యపురం గ్రామ మాజీ సర్పంచ్ గాదం యాదగిరి కోరారు. కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలో ఆయన సోమవారం మాట్లాడు తూ కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో భూములు కోల్పోయిన అయోధ్యపురం గ్రామ రైతుల కుటుంబాలు ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశా మన్నారు.
గత జులై నెలలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్, కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కాజీపేట్ రైల్వే మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్ సందర్శించ డానికి విచ్చే సినప్పుడు భూములు కోల్పోయిన మా కుటుంబాల పిల్లలకు షెడ్డులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులకు సహకరించి హన్మకొండ జిల్లా కలెక్టర్ ద్వారా అర్హులను ఎంపిక చేసిన పేర్లను రైల్వే శాఖకు ఇచ్చినట్లయితే తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు.