వరంగల్ : పరకాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బండారి కవిత కాంగ్రెస్ పార్టీని వీడుతూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో 9వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బండారి కవితని ప్రకటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.