Goddess Kali: రోలింగ్ స్టోన్స్ మ్యూజిక్ బ్యాండ్ లోగో .. కాళీమాత ఎర్రటి నాలుకకు లింకేంటో తెలుసా?
Goddess Kali: మ్యూజిక్ బ్యాండ్ రోలింగ్ స్టోన్స్.. కాళీమాతకు ఓ సిమిలారిటీ ఉన్నది. కాళీదేవి ఇన్స్పిరేషన్తోనే .. రోలింగ్ స్టోన్స్ లోగో తయారైంది. దీని వెనుక చాలా స్టోరీ ఉన్నది. ఆ ఫేమస్ లోగో గీసిన వ్యక్తే ఈ విషయాన్ని చెప్పారు.
న్యూయార్క్: రోలింగ్ స్టోన్స్ అనేది ఫేమస్ మ్యూజికల్ బ్యాండ్. రాక్ పాటలతో ఆ బ్యాండ్ ఉర్రూతలూగిస్తుంది. అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాల్లో ఆ బృందం క్రియేట్ చేసే సాంగ్స్‌కు చాలా క్రేజ్ ఉంది. ఆ మ్యూజికల్ బ్యాండ్ లోగో కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు థ్రిల్ చేస్తూనే ఉన్నది. సాగదీసిన ఎరుపు రంగు నాలుక లోగో.. మ్యూజిక్ ప్రేమికుల్ని గత కొన్ని దశాబ్దాలుగా ఆకట్టుకుంటోంది. అయితే ఆ ఎరుపు రంగు నాలుక డిజైన్ వెనుక చాలా స్టోరీ ఉంది. ఆ డిజైన్ క్రియేట్ చేయడానికి .. భారతీయ సంస్కృతితో సంబంధం ఉన్నది. మన పురాణాల్లో కాళీమాత(Goddess Kali) నాలుక కూడా ఎర్రగా.. కిందకు సాగదీసినట్లు వెలాడుతుంది. అయితే ఆ కాళీ బొమ్మ ప్రేరణతోనే రోలింగ్స్ స్టోన్స్ తన లోగోను డిజైన్ చేసినట్లు తెలిసింది.
గత అయిదు దశాబ్ధాల నుంచి ఆ పాపులర్ మ్యూజిక్ లోగోనే .. రోలింగ్ స్టోన్స్ ఆల్బమ్స్, పోస్టర్లపై కనిపిస్తున్నది. శక్తి స్వరూపిణి కాళీదేవి నాలుక ఇన్స్పిరేషన్ తో మ్యూజిక్ బ్యాండ్ లోగో డిజైన్ చేసిన విషయాన్ని జాన్ పాష్ తెలిపారు. 1970 దశకంలో రోలింగ్ స్టోన్స్ బ్యాండ్ యూరోప్ టూర్‌కు వెళ్లింది. అయితే అప్పటికే డెక్కా రికార్డ్స్ కంపెనీ తయారు చేసిన పోస్టర్ల డిజైన్ పట్ల ఆ బ్యాండ్ అసంతృప్తితో ఉన్నది. మరింత ఆకర్షణీయంగా పోస్టర్స్ డిజైన్ చేయాలన్న ఆలోచన చేశారు. నిరంకుశత్వానికి విరుద్ధంగా ఓ బలమైన లోగోను చేయాలన్న భావన వ్యక్తం చేశారు. టూరు పోస్టర్‌తో పాటు బ్యాండ్‌కు చెందిన లెటర్ హెడ్స్, ప్రోగ్రామ్స్, ప్రెస్ కోసం సింబల్ రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చారు.
లండన్లోన రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న జాన్ పాష్ రూపొందించిన కొన్ని వర్క్స్ రోలింగ్ స్టోన్స్ క్రియేటర్ మిక్ జాగర్‌కు నచ్చాయి. జాన్ పాషే తయారు చేసిన సెకండ్ పోస్టర్ డిజైన్‌కు అప్రూవల్ కూడా దక్కింది. అయితే లోగో కోసం వాళ్లు తీవ్రంగా శ్రమించారు. ఐడియాస్ డిస్కషన్ చేస్తున్న సమయంలో మిక్ జాగర్ ఓ సలహా ఇచ్చాడు. హిందూ దేవత కాళీ చిత్రాన్ని ఆర్టిస్టుకు చూపించాడు. కాళీ నాలుక గురించి డిస్కస్ చేశారు. పెట్రోల్ బంకుల్లో షెల్ కంపెనీ లోగో తరహాలో.. ఏదైనా లోగో చేయాలని చెబుతూ.. మిగ్ జాగర్ తనకు కాళీమాత ఫోటోను చూపించినట్లు జాన్ పాషే తెలిపారు. వేలాడుతున్న కాళీ నాలుక పిక్ ఆధారంగా ఓ ఆలోచన వచ్చినట్లు జాన్ చెప్పారు. చిన్న పిల్లలు కూడా తమ నాలుకలను అలాగే బయటపెడుతారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కాళీమాత శక్తికి, శత్రునాశనానికి సింబల్‌గా భావిస్తారు. అయితే ఇండియన్ స్టయిల్లో కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించే రీతిలో ఆ నాలుకను డిజైన్ చేయాలని భావించారు. నిరంకుశానికి వ్యతిరేకంగా తమ నాలుక సింబల్ ఉండాలన్న ఉద్దేశంతో డిజైన్ చేశారు. సాగిన ఎరుపు నాలుకను తన కాన్వాస్‌తో మరింత సరళంగా, ఆకర్షణీయంగా మార్చేశారు. దీంతో ఆ నాలుక సింబల్ ఇప్పుడు ఫేమస్ లోగోగా మారింది. రోలింగ్స్ స్టోన్స్ మ్యూజిక్ బ్యాండ్ పాపులర్ కావడానికి కాళీనాలుక కూడా ఓ కారణమైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

