Fire accident |హనుమకొండ బాలసముద్రంలోని మున్సిపల్ వెహికిల్ షెడ్ ఆవరణలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రమైన పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే రిపేరింగ్ షెడ్ చుట్టూ పక్కల పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండటంతో పేషెంట్స్ సైతం ఇబ్బంది పడుతున్నారు. మంటలు ఆర్పడానికి మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.