Hanumakonda | వ్యాపారి చేతిలో మోసపోయిన కుటుంబం ఆత్యహత్యాయత్నం
వ్యాపారి చేతిలో మోసపోయిన ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
హనుమకొండ చౌరస్తా, మార్చి 17: వ్యాపారి చేతిలో మోసపోయిన ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..వరంగల్‌లోని లక్ష్మీనారాయణ అనాజ్ కిరాణం హోల్‌సేల్ వ్యాపారి గుండా రఘురాం చేతిలో దారుణంగా మోసపోయామని, తమకు జరిగిన అన్యాయంపై ఎక్కడా న్యాయం జరగడం లేదని బాధితుడు చంద నవీన్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద బాధితులు పురుగుల మందు డబ్బాలు పట్టుకుని కుటుంబ సభ్యులతో నిరసనకు దిగారు.
కాజీపేట కూరగాయ మార్కెట్ వద్ద కిరాణం షాపు నిర్వహిస్తున్న తమకు వరంగల్‌లో లక్ష్మీనారాయణ అనాజ్ కిరాణం హోల్‌సేల్ వ్యాపారి గుండా రఘురాం వద్ద కిరాణ సామాన్లు తీసుకుంటామని నవీన్ తెలిపారు. అలా పరిచయమైన రఘురాం అప్పుల్లో ఉన్న తన ఇల్లును మార్టిగేజ్ లోన్ ఇప్పిస్తానని చెప్పి ఏకంగా తన భార్య శ్వేత పేరుతో ఇల్లు, ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడని వాపోయారు.
రఘురాం, ఆయన భార్య శ్వేత తడిగుడ్డతో గొంతులు కోశారని వాపోయారు. తమకు బతకడం ఇష్టం లేదని, సామూహికంగా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వారు హైకోర్టు న్యాయమూర్తికి విన్నవించారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతున్న భార్యాభర్తలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

