పరకాల: పరకాల కేంద్రంగా పనిచేసే ప్రతి జర్నలిస్టు ప్రెస్ క్లబ్ సభ్యత్వం తీసుకోవాలని ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సలహాదారు దాసరి రమేశ్ (Dasari Ramesh) అన్నారు. ప్రెస్ క్లబ్లో పలువురు జర్నలిస్టులకు సభ్యత్వం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణకుగాను సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే ప్రెస్ క్లబ్ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని, అందుకోసం ప్రతి జర్నలిస్టు సభ్యత్వం తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పోచంపల్లి రాజ్ కుమార్, చొల్లేటి సునేందర్, మహమ్మద్ నయీమ్ పాష, బూర తిరుపతి, కొడెపాక దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.