హనుమకొండ చౌరస్తా, మార్చి 25: ఛత్తీగఢ్ రాష్ర్టంలో ఈనెల 25 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా ఫస్ట్ ఎడిషన్ ట్రైబల్ గేమ్ పోటీలకు హనుమకొండ జిల్లా యువజన క్రీడాశాఖాధికారి(డీవైఎస్వో) గుగులోత్ అశోక్‌కుమార్ నియమించడంతో జిల్లా క్రీడా సంస్థ (డీఎస్ఏ) కోచ్‌లు, సిబ్బంది ఆధ్వర్యంలో హనుమకొండ జేఎన్‌ఎస్‌లోని కార్యాలయంలో బుధవారం ఘనంగా సత్కరించారు.
ఆయన క్రీడాఅభివృద్ధికి చేసిన సేవలను ప్రశంసిస్తూ పలువురు కోచ్‌లు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఈ బాధ్యత తనకు గౌరవమని, దేశవ్యాప్తంగా జరిగే ఈ క్రీడా ఉత్సవంలో తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడా రంగ అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు.