ధర్మసాగర్ : సర్పంచ్లు అంకితభావంతో పని చేస్తూ గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలని మండల ప్రత్యేకాధికారి, డీఆర్డీవో మేన శ్రీను సూచించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అనిల్ కుమార్ అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్లు వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామాలను ప్రగతి పథంలో నిలపాలని, పల్లెల అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు.
ముఖ్యంగా గ్రామాలలో హెల్త్, శానిటేషన్ ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సదానందం, ఎంఈవో రాంధన్, పీఆర్ డీఈ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ఎస్ డీఈ శ్రీనివాసరావు, ఎంపీవో అఫ్జల్ పాషా, ఎంఏఓ రాజేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.