వేలేరు : పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కువుగా మానసిక ఒత్తిడికి గురికావొద్దని, పరీక్షలలో ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని, నిరాశ నిస్పృహలకులోనై ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలకు గురి కావొద్దని సైకియాట్రీస్ట్ డాక్టర్ ప్రహాసిత్ సూచించారు. బుధవారం వేలేరు మండలంలోని కేజీబీవీ, బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మానసిక ఒత్తిడి పై అవగాహన కల్పించారు.
మానసిక పరమైన ఆలోచనలు కలిగితే 14416 టెలీ మానస్ కి కాల్ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వేలేరు పీహెచ్సీ డాక్టర్ నవీన్, ఎస్ఓ స్రవంతి, గురుకుల కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అజయ్ కుమార్, హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది ప్రసాద్, నరేష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.