ధర్మసాగర్ : హనుకొండ జిల్లా మండలంనారాయణగిరి గ్రామంలోని సబ్ సెంటర్ను డీఎంహెచ్వో అప్పయ్య (Dr. Appaiah)పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సబ్ సెంటర్ పరిధిలో ఉన్న గ్రామాల గర్భిణీలకు,0-5 లోపు పిల్లలకు ఇచ్చే టీకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్రమం తప్పకుండా గర్భిణులకు నెలసరి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. చిన్న పిల్లలకు కూడా బుధవారం, శనివారం ఇచ్చే టీకాలను సక్రమంగా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ భారతి, హెల్త్ సూపర్వైజర్ రామ్మోహన్ రావు, రమాదేవి ఏఎన్ఎంలు సుమతి, రజిత, స్వప్న, ఆశా కార్యకర్తలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Ranya Rao: 14.8 కేజీల బంగారంతో పట్టుబడిన నటి రాన్యా రావు గురించి మీకీ విషయాలు తెలుసా?
Dairy Farmers | పాల బిల్లులు చెల్లించాలని పాడి రైతుల ఆందోళన.. మద్దతు పలికిన బీఆర్ఎస్ శ్రేణులు