Teenmar Mallanna | రేవంత్ రెడ్డి సీఎం కుర్చీకి పునాది వేసిందే నేనే.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
Teenmar Mallanna | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీకి పునాది వేసింది తానే అని మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
Teenmar Mallanna | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీకి పునాది వేసింది తానే అని మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇందుకు కారణం రేవంత్ రెడ్డినే అని ఆరోపించారు. రేవంత్ విధానాల వల్ల ప్రజలు విసిగిపోతున్నారని మల్లన్న పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్ పార్లమెంట్ సీటు, రేవంత్ రెడ్డి సిట్టింగ్ మల్కాజ్గిరి రెండు సీట్లల్లో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాడు. ఒక వేళ రేవంత్ రెడ్డి బలంగా ప్రచారం చేసి ఉంటే.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాకపోయేది అని పేర్కొన్నారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందో రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
ఇటీవల జరిగిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమికి రేవంత్ రెడ్డినే కారణమని ఎమ్మెల్సీ మల్లన్న ఆరోపించారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు. ఒక పని చేస్తే తరతరాలు మన పేరు గుర్తుండాలి.. రేవంత్ రెడ్డి పని చేస్తే తోటి మంత్రులే ఆయన పేరు మర్చిపోతున్నారు అని తీన్మార్ మల్లన్న విమర్శించారు. రేవంత్ రెడ్డి విలన్ కాబట్టే విలన్ అని అంటున్నారు అని మల్లన్న చెప్పారు. నువ్వు చేసిన కులగణన సర్వే తప్పు అని నేను నిరూపిస్తా, చర్చకు సిద్ధమా..? అని రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న సవాల్ విసిరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

