Dairy Farmers | కడ్తాల్, మార్చి 5: పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ… పాడి రైతులు ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. పాడి రైతులు చేపట్టిన ముట్టడి కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలోని హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహాదారిపై పాడి రైతులు, నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడి రైతుల నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండున్నర నెలలుగా ప్రభుత్వం పాల బిల్లులు చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పశువులకు దాణా, మేత కొనలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చెయ్యాల్సిన దాపురిచ్చిందన్నారు. ప్రజా భవన్ ముట్టడికి వెళ్తున్న పాడి రైతులు, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి కడ్తాల్ పోలీస్ స్టేషన్ తరలించారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ గుప్తా, మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రామకృష్ణ, సింగిల్ విండో డైరెక్టర్ వీరయ్య, మాజీ ఎంపీటీసీలు గోపాల్, రమేష్ నాయక్, మాజీ సర్పంచులు కృష్ణయ్య యాదవ్, హరిచంద్ నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హెచ్ ఆర్ మహేష్ నాయకులు రాజేందర్ యాదవ్, పాండు యాదవ్, నరసింహ, మహేష్, రాములుయాదవ్, రామచంద్రయ్య, రవి, రమేష్, జగన్ యాదవ్, అంజి, శ్రీకాంత్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.