బెంగుళూరు: కన్నడ నటి రాన్యా రావు(Ranya Rao) బెంగుళూరు విమానాశ్రయంలో 14.8 కేజీల బంగారంతో దొరికిన విషయం తెలిసిందే. ఆమెను మంగళవారం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల జుడిషియల్ కస్టడీ ఆమెకు విధించారు. గత 15 రోజుల్లో ఆమె నాలుగుసార్లు దుబాయ్ వెళ్లడాన్ని గమనించిన అధికారులు ఆమెపై నిఘా ఉంచారు. ఓ ఐపీఎస్ అధికారికి ఆమె దగ్గరి బంధువని వారు తెలిపారు. ఆ హీరోయిన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
రాన్యా రావుది కర్నాటకలోని చికమంగళూరు ప్రాంతం. బెంగుళూరులోని దయానంద్ సాగర్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఆమె ఇంజినీరింగ్ పట్టా పొందారు. 2014లో ఆమె చిత్ర రంగంలో ప్రవేశించింది. మానిక్య చిత్రంలో ఆమె కన్నడ సూపర్‌స్టార్ సుదీప్తో కలిసి నటించారు. 2013లో రిలీజైన తెలుగు చిత్రం మిర్చీకి రిమేక్ ఇది. మానిక్య ఫిల్మ్‌లో రాన్యా రావు పాత్ర పేరు మానస. ఓ సంపన్న కుటుంబం అమ్మాయిగా ఆ పాత్రలో నటించిందామె.
2016లో రిలీజైన తమిళ చిత్రం వాఘాలో కూడా ఆమె నటించింది. దీంట్లో విక్రమ్ ప్రభు ప్రధాన పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌కు చెందిన ఆ అమ్మాయిని తీసుకెళ్తున్న సమయంలో అల్లర్లు జరుగుతాయి. భారతీ సైనికుడు సురక్షితంగా ఆమెను స్వదేశానికి తీసుకెళ్తాడు. 2017లో రిలీజైన కన్నడ కామిడీ చిత్రం పటాకీలో ఆమె నటించింది. జర్నలిస్టు సంగీత పాత్ర లో ఆమె నటించింది. ఆ ఫిల్మ్ గణేశ్ హీరోగా నటించాడు. కర్నాటక పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ డీజీపీ రామచంద్ర రావుకు కూతురు అని ఆమె చెప్పుకుంటోంది.