Iraran war | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు అమెరికా, ఇరాన్ చర్చలు జరుపుతూనే మరో వైపు రెండు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఒమన్ గల్ఫ్‌లో ఒక అమెరికా(America) డిస్ట్రాయర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడినట్లు ఇరాన్ నౌకాదళం పేర్కొంది. ఇరాన్ వాణిజ్య నౌకాయానానికి వ్యతిరేకంగా అమెరికా తీసుకుంటున్న చర్యలకు ఆ నౌక ‘కమాండ్-అండ్-కంట్రోల్ సెంటర్’గా పనిచేస్తోందని ఆరోపించింది.
ఇరాన్ దాడిలో కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు ఇరాన్ పేర్కొంది. అయితే, అమెరికా అధికారులు, అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ఈ వాదనలను తోసిపుచ్చాయి. ఇరాన్ వాదనలను తిప్పికొడుతూ అమెరికా కార్యకలాపాలు ఎలాంటి ఆటంకం లేకుండా యుద్ధ నౌకలు పూర్తి సురక్షితంగా ఉన్నాయని అమెరికా సైన్యం తెలిపింది.