పుణె: పుణెకు చెందిన థింక్ టెక్నాలజీ ఇండియా కంపెనీ(Pune IT Company) అకస్మాత్తుగా మూసివేశారు. దీంతో ఆ కంపెనీలో పనిచేస్తున్న సుమారు 700 ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు, ఇంటర్నీలు ఉన్నారు. ఉద్యోగులకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా కంపెనీ మూసివేశారు. కొందరు ఉద్యోగులకు ఇంకా జీతాలు ఇవ్వలేదు. చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఆర్థిక అవకతవకలకు ఆ కంపెనీ పాల్పడినట్లు తెలుస్తోంది. సడెన్‌గా కంపెనీ మూసివేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. చీటింగ్ కేసులో కంపెనీ సీఈవోను అరెస్టు చేశారు. 25 ఏళ్ల ఇంటెర్న్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హింజెవాడి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. సుమారు 30 మంది ఇంటర్నీలు, ఉద్యోగులు ఇలాంటి ఫిర్యాదులే ఇచ్చినట్లు తెలిసింది. కంపెనీ సీఈవోతో పాటు ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అధినేత, హెచ్ఆర్ మేనేజర్‌ను కూడా ఈ కేసులో బుక్ చేశారు. ఏప్రిల్‌లో కంపెనీ తన ఆపరేషన్స్ నిలిపివేసినట్లు ఉద్యోగులు తెలిపారు.
#ThynkTech owner who scammed 700+ Fresher’s is finally arrested by #Hinjawadi police after #FiteForums collective efforts on same .
We urge employees to come forward and report such scams . pic.twitter.com/0hEUqxaTyz— Forum For IT Employees – FITE (@FITEMaharashtra) June 3, 2026