S-400 Missile System: భారత్‌కు చేరిన నాలుగవ ఎస్-400 మిస్సైల్ సిస్టమ్
S-400 Missile System: ఎయిర్ డిఫెన్స్‌కు చెందిన ఎస్-400 నాలుగవ మిస్సైల్ సిస్టమ్ ఇండియాకు చేరుకున్నది. పలు రకాల క్షిపణులు, లాంచర్లు, సెన్సార్లు, రేడార్లు ఆ సిస్టమ్‌లో ఉన్నాయి. ఈ మిస్సైల్ వ్యవస్థకు చెందిన పరికరాలను ఇక్కడే అసెంబ్లింగ్ చేయనున్నారు. ఇక అయిదో మిస్సైల్ సిస్టమ్ ఈ ఏడాది చివరకు రష్యా నుంచి రానున్నది.
న్యూఢిల్లీ: భారతీయ వైమానిక రక్షణ సామర్థ్యం మరింత మెరుగుపడింది. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థ(S-400 Missile System)కు చెందిన ఫోర్త్ స్క్వాడ్రన్ ఇండియాకు చేరుకున్నది. ఈ క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేశారు. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో క్షిపణులు, లాంచర్లు, సెన్సార్లు, రేడార్లు ఉంటాయి. అయితే దశల వారీగా రష్యా నుంచి భారత్‌కు ఈ పరికరాలు వస్తున్నాయి. దీనిలో భాగంగా తొలి కన్సైన్మెంట్ ఇవాళ చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో మిగితా పరికరాలు దిగుమతికానున్నాయి. ఒకసారి అసెంబ్లింగ్ చేస్తే, ఇక భారతీయ వైమానిక దళం ఎస్-400 క్షిపణి వ్యవస్థను ఆపరేషన్లోకి తీసుకురావచ్చు.
2018లో రష్యాతో ఎస్-400 కొనుగోలు కోసం 5.4 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం మూడు క్షిపణి వ్యవస్థలను డెలివరీ చేశారు. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల మరో రెండు సిస్టమ్‌ల డెలివరీ ఆలస్యం అవుతోంది. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లను ఎస్-400 సిస్టమ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్-400 పనితీరుకు చెందిన ఓ వీడియోను కూడా వైమానిక దళం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ విమానాన్ని ఎస్-400 సిస్టమ్ కూల్చివేసినట్లు ఐఏఎఫ్ చెప్పింది.
అయిదో స్క్వాడ్రన్‌కు చెందిన ఎస్-400 మిస్సైల్ సిస్టమ్ ఈ ఏడాది చివర వరకు భారత్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

