Thousand Pillers Temple | హనుమకొండ చౌరస్తా, జనవరి 1: గురువారం నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో భక్తులతో సందడిగా మారింది. ఉదయం ఉత్తిష్టగణపతికి గరికాభిషేకం, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, నమకచమకాలతో రుద్ర అధ్యాయంతో దంపతులు, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వర్తించుకున్నారు.
రుద్రేశ్వరాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. రుద్రేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు గంగు మణికంఠశర్మ, ప్రణవ్‌శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు చేశారు. ఆలయ సిబ్బంది రజిత, ఎల్.రామకృష్ణ, రుద్రేశ్వర సేవాసమితి, శ్రీవెంకటేశ్వర సేవా సమితి సభ్యులు విశేష సేవలందించారు.



Air India | విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ వద్ద మద్యం వాసన.. అరెస్ట్