గీసుగొండ : పేకాట ఆడుతున్న ఐదుగురిపై టస్క్‌ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ సంతోశ్, శ్రీనివాస్ తెలిపారు. గ్రేటర్ వరంగల్‌లోని ధర్మారం గ్రామ శివారులోని లారీ ఆసోసియేషన్ కార్యాలయం వెనుకల బుధవారం ఐదుగురు వ్యక్తులు ఎండీ ఇస్మాయిల్, ఎండీ జావీద్, ఎండీ ఉమర్, ఎండీ యాకుబ్ పేకాట ఆడుతున్నరని విశ్వసనీయ సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని వారిని పట్టుకున్నమని తెలిపారు. వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లు, కార్డ్స్‌తో పాటు రూ. 12,740 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.