బచ్చన్నపేట, మార్చి 09 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని జనగామ జిల్లా సీపీఎం పార్టీ చిన్న రామంచర్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల సీనియర్ నాయకుడు రామగల్ల అశోక్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల నడ్డి విరిచిందన్నారు. అలాగే లేబర్ కోడు చట్టాలను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసి, ఇప్పుడు పేద ప్రజలపై గ్యాస్ ధరలను పెంచి ఈ దేశంలోని ప్రజల బతుకులను వెనక్కి నెట్టేస్తుందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు విసిగి వేసారి పోయారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలు మార్చుకోకపోతే భవిష్యత్తులో మనుగడ సాగించలేదని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శి బుర్రి సుధాకర్,మండల కమిటీ సభ్యులు అన్న బోయిన రాజు,నాయకులు కొత్తపల్లిబాల నరసయ్య, గుడికందుల కనకయ్య,కంత్రి ఐలయ్య, గంధమాల మనోహర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.