Warangal | డ్రైవర్లు దృష్టి లోపాలు రాకుండా జాగ్రత్త పడాలి: సీపీ సంప్రీత్ సింగ్
డ్రైవర్లు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా దృష్టి లోపాలు తలెత్తకుండా ఆహారపు అలవాట్లును మార్చుకోవాలని వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.
వరంగల్ చౌరస్తా : ప్రజా రవాణా రంగంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న డ్రైవర్లు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా దృష్టి లోపాలు తలెత్తకుండా ఆహారపు అలవాట్లును మార్చుకోవాలని వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఆరైవ్ అలైవ్ రెండవ విడత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ ట్రాఫిక్ సీఐ కోడూరి సుజాత ఆధ్వర్యంలో ములుగు రోడ్డు వద్దనున్న వెంకటేశ్వర గార్డెన్స్‌లో ఆటో, లారీ డ్రైవర్లకు అవగాహణ సదస్సును నిర్వహించి, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆటో, లారీ డ్రైవర్లను ఉద్దేషించి ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని, దృష్టిని కాపాడుకోవడానికి కనీస జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రైవర్లు మాత్రం ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన సూచించారు. నిత్యం రోడ్డు ప్రయాణాలలో జీవితాన్ని గడిపే డ్రైవర్లు తమ జాగ్రత్తతో పాటుగా ప్రయాణికుల కాపాడటం కోసం ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు.
ప్రాంతీయ నేత్ర వైద్యశాల, శరత్ కంటి వైద్యశాల, కీర్తి కంటి వైద్యశాల వైద్యుల ఆధ్వర్యంలో ఈ శిబిరంలో సుమారు 400 మంది ఆటో, లారీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు చేసి అద్దాలను అందజేవారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, నర్సింహరావు, ఇన్స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, మట్టెవాడ, ఇన్స్పెక్టర్ కరుణాకర్‌రావు, కంటి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ దిలీప్, రంజన్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

