హనుమకొండ(ఐనవోలు): ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థాన కొబ్బరి ముక్కలు సేకరించే గుత్తేదారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థాన ఆర్చకులు, సిబ్బంది మంగళవారం రాస్తారోకో చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం కొబ్బరి ముక్కల టెండర్దారులు గుండెబోయిన లావణ్య, యాదగిరి గతంలో పలుమార్లు ఆలయానికి వచ్చిన భక్తులను నానా బూతులు తిడుతూ భౌతికంగా దాడులకు పాల్పడగా ఈవోకు ఫిర్యాదులు చేశామన్నారు. ఈవో సదరు గుత్తేదారురాలుకు గతంలోనే నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పకపోగా ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడమే కాకుండా టెండరు దారురాలు సోమవారం సాయంత్రం నాకే నోటీసు ఇస్తారా అని ఆలయా కంప్యూటర్ ఆపరేటర్ ను నానా బూతులు తీడుతూ భౌతిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, వారిని పోలీసు స్టేషన్ తీసుకవెళ్లి విడిచి పెట్టడంతో తిరిగి మంగళవారం ఉదయం ఆలయ సిబ్బంది ఇంటికి వెళ్లి తిడుతూ, దాడి చేసే ప్రయత్నం చేయగా 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేసిన్నట్లు పేర్కొన్నారు. సదరు గుత్తేదారురాలు పైన పలుమార్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ మేరకు ఎస్ఐ పస్తం శ్రీనివాస్ రాస్తారోకో చేస్తున్న ఆలయా అర్చక, సిబ్బందితో గుత్తేదారులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించి విధులకు హాజరయ్యారు.
రాస్తారోకోలో ఆర్చకులు నరేశశర్మ, మధుకరశర్మ, మధుశర్మ, దేవేందర్ శర్మ, సిబ్బంది తాళ్లపల్లి శ్రీకాంత్, నకరకంటి రాజు, కంప్యూటర్ ఆపరేటర్ తీగల రాజు, బొల్లెపల్లి కుమారస్వామి, ఎండీ లతీఫ్, స్వీపర్లు యాదమ్మ, స్వరూప, సుజాత, స్వప్న, రాధిక, కొంరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయం పై ఎస్ఐ శ్రీనివాస్ వివరణ కోరగా ఫిర్యాదులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.